Header Banner

సాయిపల్లవికి విశ్రాంతి సూచించిన వైద్యులు! ఈ కారణం వల్లే ముంబైలో..

  Sun Feb 02, 2025 13:46        Entertainment

ప్రముఖ సినీ నటి సాయిపల్లవి అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు చందు మొండేటి వెల్లడించారు. సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె 'తండేల్' సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని... దీంతో ఆమె మరింత నీరసించిపోయారని చెప్పారు. కనీసం రెండు రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు సూచించారని తెలిపారు. ఈ కారణం వల్లే ముంబైలో జరిగిన 'తండేల్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయిపల్లవి పాల్గొనలేకపోయారని చెప్పారు. 'తండేల్' సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు... అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 'లవ్ స్టోరీ' తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో... ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SaiPallavi #Tollywood #HealthProblem #DoctorRest